

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి తిరిగి అప్పగించే అంశంపై ఆ దేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి భారత్ ఎలాంటి షరతులు విధించలేదని బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జాహెద్ ఉర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర, సార్వభౌమ దేశమని, తమ నిర్ణయాలపై ఇతర దేశాలు ఒత్తిడి తీసుకురాలేవని పేర్కొన్నారు. హసీనా అప్పగింత ప్రక్రియ భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగానే కొనసాగుతుందని వెల్లడించారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల విచారణ పూర్తిగా బంగ్లాదేశ్ దేశీయ చట్టాల ప్రకారమే జరుగుతుందని జాహెద్ ఉర్ రెహ్మాన్ తెలిపారు. తమ న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఈ కేసులను విచారిస్తుందని స్పష్టం చేశారు. హసీనాను తిరిగి స్వదేశానికి తీసుకురావడంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలు భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ, న్యాయపరమైన పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!