

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష కూటమి పార్లమెంట్ స్పీకర్ పదవిని దక్కించుకుంది. యషార్ పార్టీకి చెందిన మతన్ కహానా ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) కొత్త స్పీకర్గా ఎన్నికయ్యారు. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ అభ్యర్థి ఓఫిర్ కాట్జ్పై 66-52 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో ప్రతిపక్ష కూటమికి పార్లమెంట్ కార్యకలాపాలు, శాసనసభ అజెండాపై మరింత పట్టు లభించినట్లయింది.
అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల అనంతరం నెతన్యాహు కూటమి పార్లమెంట్లో తన మెజారిటీని కోల్పోయింది. ప్రతిపక్ష నేత గడి ఐసెన్కోట్ నేతృత్వంలోని కూటమికి చెందిన పార్టీలతో పాటు అరబ్ పార్టీల మద్దతుతో మతన్ కహానా స్పీకర్ పదవిని కైవసం చేసుకున్నారు. మరోవైపు నెతన్యాహు స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గడి ఐసెన్కోట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, స్పీకర్ పదవి ప్రతిపక్ష కూటమి చేతికి వెళ్లడం నెతన్యాహు వర్గానికి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!