

రామోజీరావు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రామోజీరావు తన పత్రికను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, తనకు నచ్చని వ్యక్తులపై వ్యతిరేక ప్రచారం చేశారని విమర్శించారు. పత్రికను అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం దారుణమని వ్యాఖ్యానించారు. రామోజీ ఫిల్మ్ సిటీ భూముల ఆక్రమణ ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు.
గతంలో రామోజీరావు వ్యవహారశైలిని పలువురు జర్నలిస్టులు వ్యతిరేకించారని, జర్నలిస్టులపై దాడులు చేయించారంటూ భూమన ఆరోపించారు. 1995లో ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, రామోజీరావు తన కలంతో పెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నార్ల వెంకటేశ్వరరావు, కాశీనాధుని నాగేశ్వరరావు, ఏబీకే ప్రసాద్ వంటి ప్రముఖులు పత్రికా విలువలను కాపాడారని గుర్తుచేశారు. రామోజీరావు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం సరైన నిర్ణయం కాదని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇతర వివాదాస్పద వ్యక్తుల జయంతులను కూడా పండుగలుగా ప్రకటించే పరిస్థితి వస్తుందని విమర్శించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!