.webp&w=3840&q=75)

లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్‌ను కోల్‌కతాలో పేస్ కలవడం ద్వారా ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. అంతకుముందు 2021లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022 గోవా ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించినప్పటికీ, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు.
బీజేపీలో చేరిన అనంతరం పేస్ మాట్లాడుతూ, తన జీవితంలో సుమారు 40 సంవత్సరాలు దేశానికి ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. అనేక అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని డేవిస్ కప్, ఒలింపిక్స్ వంటి వేదికలపై దేశానికి గౌరవం తీసుకువచ్చానని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త రంగంలో అడుగుపెడుతున్నానని, తనకు ఈ బాధ్యతను అప్పగించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం, యువత కోసం సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నితిన్ నబిన్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!