
జనరల్

నెదర్లాండ్స్‌లో శనివారం ఒక్క రోజే 3,01,137 పిడుగులు పడ్డాయి. తీవ్ర ఎండల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లో 3 లక్షలకుపైగా పిడుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత వారం కూడా ఒక రోజులో 1,88,000 పిడుగులు నమోదయ్యాయి.
ఈ భారీ పిడుగుల కారణంగా పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నెదర్లాండ్స్‌తో పాటు ఉత్తర జర్మనీలో కూడా 30 నిమిషాల్లో 30,000 పిడుగులు పడ్డాయి. ప్రతి సెకనుకు సుమారు 17 పిడుగులు నమోదు కావడం గమనార్హం. వాతావరణంలో ఈ తీవ్ర మార్పుపై అధికారులు అప్రమత్తమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!