
జనరల్

వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తూ రోడ్లను సరిగా నిర్వహించకపోవడం సేవా లోపమేనని నాగ్‌పుర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. గుంతల కారణంగా కారు దెబ్బతిన్న ఫిర్యాదుదారుడికి మరమ్మతుల కోసం రూ.1,030, మానసిక, శారీరక ఇబ్బందులకు రూ.10,000, అలాగే వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ఛింద్వాడా ప్రాజెక్టు విభాగాన్ని ఆదేశించింది.
మహారాష్ట్ర నాగ్‌పుర్ నుంచి మధ్యప్రదేశ్ ఛింద్వాడాకు ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుపై గుంతల వల్ల వాహనం దెబ్బతిన్నట్లు ఫిర్యాదుదారు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. టోల్ వసూలు చేస్తూ సరైన రహదారి నిర్వహణ చేయకపోవడం బాధ్యతల లోపమని కమిషన్ తేల్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!