

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. కొద్దిమంది ప్రయోజనాల కోసమే పాలన సాగించారని, రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.
ఎర్రుపాలెంలోని జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రూ.22,500 కోట్లతో మంజూరు చేశామని భట్టి తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు ఉచిత సన్నబియ్యం, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. 76 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చామని, రూ.90 వేల కోట్లతో రహదారి పనులు, రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులు చేపడుతున్నామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!