
సినిమాలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కొడంగల్, బోధన్ నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు, చేర్పుల విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. గత ఎన్నికలకు ముందు కొడంగల్‌లో సుమారు 30 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, అందులో 11 వేల మంది కర్ణాటకకు చెందిన ఓటర్లు ఉన్నారని ఆమె ఆరోపించారు.
బోధన్ నియోజకవర్గంలో ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించగా, కొడంగల్‌లో కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించడంపై కవిత సందేహాలు వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య డూప్లికేట్ ఓట్లను గుర్తించే వ్యవస్థ ఎన్నికల సంఘం వద్ద లేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!