
సినిమాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్లో పర్యటించి గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రజాదరణ పెరుగుతోందని, అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.
తెలంగాణలో గత ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని నితిన్ నబీన్ విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!