

ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌పై తీవ్రంగా స్పందించారు. తన నాలుక కోసి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కానుకగా పంపిస్తానన్న వ్యాఖ్యలు క్రిమినల్ చర్యలకే చెందుతాయని ఆయన అన్నారు. ఒక వర్గంపై సుప్రీంకోర్టు సూచనలు, రాజ్యాంగ విషయాలు ప్రస్తావించినందుకు ఇలాంటి బెదిరింపులు చేయడం హత్యకు ప్రేరేపించడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ ఘటనలో జనసేన నాయకులపై దాడి జరిగిందని, దీనిపై మాట్లాడితే దానిని మతపరంగా వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ మతపరంగా ఎవర్నీ హేళన చేయలేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోంమంత్రి అయిన తర్వాతే ఈ విషయంపై ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం ఉపేక్షించదనే నమ్మకం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!