
గాసిప్స్

భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై చర్చించేందుకు కొండా సురేఖ, కొండా మురళి వరంగల్ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు. తొలుత ఈ భేటీ వరంగల్‌లోని వారి నివాసంలో జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా హోటల్‌కు మార్చినట్టు సమాచారం. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత కార్యకర్తలు, అనుచరులతో నిర్వహిస్తున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, కొండా సురేఖకు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలతో సమావేశం అనంతరం సురేఖ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా కుటుంబం తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!