

యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎలెనా రిబకినా గెలుచుకుంది. ఫైనల్లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్యనా సబలెంకాను ఓడించింది. 2024, 2025 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన సబలెంకా.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరుకుని హ్యాట్రిక్ టైటిళ్లపై కన్నేసింది. అయితే రిబకినా నుంచి ఆమెకు తీవ్ర పోటీ ఎదురైంది. తొలి సెట్‌ను 4-6తో కోల్పోయిన రిబకినా, రెండో సెట్‌లో 7-5తో పుంజుకుంది.
నిర్ణయాత్మక మూడో సెట్‌లో రిబకినా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 6-2తో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఓటమితో తీవ్ర అసహనానికి గురైన సబలెంకా రాకెట్‌ను విరగ్గొట్టగా, తనను కవర్ చేసేందుకు వచ్చిన కెమెరామెన్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే టోర్నీలో సబలెంకాను వెనక్కి నెట్టి రిబకినా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. దీంతో 99 వారాలుగా అగ్రస్థానంలో ఉన్న సబలెంకా ర్యాంక్ కోల్పోయింది. ఒకే ఏడాదిలో రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో నంబర్ వన్ ర్యాంకర్‌ను ఓడించిన రెండో మహిళా ప్లేయర్‌గా రిబకినా నిలిచింది. 1995లో స్టెఫీ గ్రాఫ్ తొలిసారి ఈ ఘనత సాధించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!