

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ఇటీవల ఊహించని విజయాన్ని అందుకున్న చిత్రంగా నిలిచింది. విడుదలై మూడు వారాలకు పైగా అవుతున్నా థియేటర్లలో మంచి ఆదరణతో ప్రదర్శితమవుతున్నట్టు సమాచారం. తండ్రి కూతురు అనుబంధానికి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించి ఈ కథను రూపొందించారు. ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పై విజయవంతంగా నడుస్తూనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ సినిమాలో త్రినాథ్‌గా రవితేజ, కావేరిగా ప్రియా భవానీ శంకర్, మణిగా బేబీ నక్షత్ర నటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు సమీపంలోని ఓ పల్లెటూరిలో కథ సాగుతుంది. త్రినాథ్ అయ్యప్ప స్వామి భక్తుడు కాగా, గ్రామంలో ఓ రౌడీ గ్యాంగ్ ప్రజలను ఇబ్బంది పెడుతుంటుంది. గురుస్వామి కుమార్తె గాయత్రికి ఏదో సమస్య ఉందని మణికి అనుమానం వస్తుంది. ఆమె ఈ విషయాన్ని తండ్రికి చెప్పేలోపే గాయత్రి ఓ రాత్రి ఇంటికి రాకపోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో త్రినాథ్ ఆమెను వెతికే క్రమంలో ఎదురయ్యే పరిణామాలే మిగతా కథ. ‘ఇరుముడి’ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!