
షోస్

ఇండోనేషియాలోని జావా సముద్రంలో సుమారు 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక గల్లంతవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. సురబయ నుంచి బంజర్‌మసిన్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో నౌకతో రాడార్ సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. దీంతో నౌకలో ఉన్న ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించి అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.
జావా సముద్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీ అలల కారణంగానే నౌక ప్రమాదానికి గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. గల్లంతైన నౌకను, అందులోని ప్రయాణికులను గుర్తించేందుకు ఇండోనేషియా దళాలు సముద్రంలో సహాయక, గాలింపు చర్యలు చేపట్టాయి. రెస్క్యూ బృందాల గాలింపు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!