
జనరల్

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న వివాదంపై అధ్యక్షురాలు సుమలత స్పందించారు. అసోసియేషన్‌కు చెందిన కొందరు సభ్యులు బ్యాంకులకు ఫోర్జరీ లేఖలు సమర్పించారని ఆమె ఆరోపించారు. బ్యాంకు లావాదేవీలు, నకిలీ పత్రాలకు సంబంధించి కోర్టు ఆర్డర్ కూడా వచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం ఈ సమస్యల పరిష్కారం కోసం ఫెడరేషన్‌తో చర్చలు జరుపుతున్నామని సుమలత చెప్పారు. కొత్త డాన్సర్లను అసోసియేషన్‌లోకి తీసుకోవచ్చని లేబర్ కమిషనర్ సూచించినట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో వివాదాలన్నీ సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!