
షోస్

వరుస సెలవులు రావడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కొన్ని ప్రత్యేక పూజలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల అభిషేకాలు, కుంకుమార్చన పూజలను నిలిపివేశారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు దర్శనం, క్యూలైన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!