

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల సంస్థాగత పర్యటనలో భాగంగా లక్నోలో పార్టీ పదాధికారులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలతో సమావేశమైన ఆయన, రాబోయే ఎన్నికలకు కార్యాచరణపై చర్చించారు. బీజేపీతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించాయని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజాసేవా దృక్పథంతో పనిచేస్తున్నారని నితిన్ నబిన్ కొనియాడారు. వారి నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసంతో 2027 ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో పోటీ చేసి మరోసారి ప్రజల మద్దతు పొందుతుందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!