

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్‌పై ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.180 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే హిందీ థియేట్రికల్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ.60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే హిందీ ఓటీటీ హక్కుల ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!