
జనరల్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో భూ పోరాటానికి సిద్ధమైన కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట నేపథ్యంలో కవితతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బొల్లారం పీఎస్ వద్ద కవిత మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలు, ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నామని, 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. హామీలు అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!