

కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, కుట్ర రాజకీయాలు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా పంచలింగాల జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అరెస్టు, జైలుకు పంపిన వ్యవహారం రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందనడానికి ఉదాహరణగా నిలుస్తుందని విమర్శించారు. బాధితులపైనే కేసులు నమోదు చేయడం, వారికి అండగా నిలిచిన వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతోందని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని జగన్ విమర్శించారు. కర్నూలు జిల్లా జైలులో తనను నిబంధనలకు విరుద్ధంగా గ్రిల్స్ వెనుక నిలబెట్టి ఫొటో తీశారని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అలా చేశామని జైలు అధికారులు చెప్పారని తెలిపారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో చెడు సంప్రదాయాలకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయడం సరికాదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!