

జెన్-జీ నిరసనకారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె వ్యాఖ్యలను విమర్శించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించారు. జెన్-జీ యువత తన వ్యాఖ్యలను పట్టించుకోదని, ప్రజాప్రతినిధిగా ఆమె పనితీరుపై కూడా సౌరవ్ విమర్శలు చేయడంతో రాజకీయంగా ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది.
దీనికి ప్రతిస్పందించిన కంగనా, తాను కేవలం రాజకీయాల్లోనే కాదు, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని పేర్కొన్నారు. సౌరవ్ ప్రస్తుతం ఉన్న వయసులోనే తాను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నానని గుర్తు చేశారు. ఎంపీగా బాధ్యతలతో పాటు దర్శకురాలు, నటి, నిర్మాత, స్క్రీన్‌రైటర్, వ్యాపారవేత్తగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని వివరించారు. సౌరవ్ దాస్ తన వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందిస్తూ, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఇరువురి మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!