
జనరల్

నిమ్స్‌లో చిన్నారుల గుండె శస్త్రచికిత్స శిబిరం విజయవంతంగా పూర్తైన సందర్భంగా వైద్యులు డి. రమణ ధన్నపునేని, ఎం. అమరేష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన శిబిరంలో పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు.
కేవలం రెండు కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించడంపై సీఎం రేవంత్ రెడ్డి వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!