

ఆసియా క్రీడల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన భారత షట్లర్లకు మరో పరీక్ష ఎదురైంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనుంది. ఆసియా క్రీడల వ్యక్తిగత విభాగంలో పతకం సాధించలేక క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించిన సింధుకు ఈ టోర్నీ తిరిగి ఫామ్‌లోకి రావడానికి మంచి అవకాశం. తన్వి శర్మ చైనీస్ తైపీకి చెందిన పిన్ చియాన్‌తో, అస్మిత చాలిహా డెన్మార్క్‌కు చెందిన లిన్ క్రిస్టోఫెర్సన్‌తో పోటీపడనుంది. ఉన్నతి హుడా చైనా క్రీడాకారిణి హన్ కియాన్‌ను ఎదుర్కోనుంది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన బ్రియాన్ యంగ్‌తో, హెచ్‌ఎస్ ప్రణయ్ డెన్మార్క్ స్టార్ ఆండర్స్ ఆంటోన్‌సెన్‌తో తొలి రౌండ్‌లో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్-ఎంఆర్ అర్జున్, కృష్ణప్రసాద్ గరగ-పృథ్వీ కృష్ణమూర్తి జోడీలు బరిలో ఉన్నాయి. హరిహరన్-అర్జున్ జోడీ ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ గ్రీన్-జాక్ రూస్‌తో, కృష్ణప్రసాద్-పృథ్వీ జోడీ చైనాకు చెందిన జి టింగ్-జియాంగ్ యూ జంటతో తలపడనుంది. ఈ టోర్నీ ద్వారా భారత షట్లర్లు మళ్లీ ఫామ్, ఆత్మవిశ్వాసాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!