

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అపూర్వ, త్రిగుణ్, రోహిత్, ముఖేష్, వర్షిణి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా.. ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం హైలైట్‌గా నిలిచింది. అపూర్వ కెప్టెన్సీపై వర్షిణి తీవ్ర విమర్శలు చేస్తూ ఆమెను ‘వరస్ట్ కెప్టెన్’గా అభివర్ణించింది. త్రిగుణ్, అపూర్వ మధ్య వాగ్వాదం వ్యక్తిగత వ్యాఖ్యల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిజికల్ గేమ్‌ను కారణంగా చూపుతూ రామ్ ప్రసాద్ అమన్‌ను నామినేట్ చేయగా, రోహిత్, వంశీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. తాజా సమాచారం ప్రకారం త్రిగుణ్, అమన్, షాలినీ, చరణ్, అపూర్వ, రోహిత్, రామ్ ప్రసాద్ ఈ వారం నామినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ ఏడుగురిలో అమన్, షాలినీ, చరణ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. గత వారం ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లిన షాలినీ ఈసారి కూడా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్‌తో ఆమె కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న లవ్ ట్రాక్, తరచూ జరిగే వాగ్వాదాలు ప్రేక్షకుల్లో ప్రతికూలతను పెంచుతున్నాయనే టాక్ ఉంది. ఇక చరణ్ ఆటలో పెద్దగా ప్రభావం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అమన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో తన ఆటను చూపించలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్రిగుణ్, రోహిత్, రామ్ ప్రసాద్‌కు బయట మంచి ఫాలోయింగ్ ఉండటంతో వారు సేఫ్ జోన్‌లో ఉన్నారని అంచనా. దీంతో ఈ వారం అమన్, షాలినీ, చరణ్‌లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఆసక్తిని పెంచుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!