

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియతోనే హీటెక్కింది. నాలుగో వారం సృష్టి ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో సమీకరణాలు మారిపోయాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈసారి నామినేషన్ల కోసం ‘రోడ్ టు రీలోడ్’ అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రవేశపెట్టారు. ఇందులో ఒక కంటెస్టెంట్ పండును బాక్సులో దాచాలి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్‌మేట్స్ ఆ పండును వెతకాలి. ముందుగా దాన్ని గుర్తించిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ టాస్క్ సందర్భంగా పోటీతో పాటు మాటల యుద్ధాలు కూడా చోటుచేసుకున్నాయి.
అమన్‌ను రాంప్రసాద్ నామినేట్ చేయగా.. అపూర్వను ముకేశ్ టార్గెట్ చేశాడు. మరోవైపు త్రిగుణ్ కూడా అపూర్వనే నామినేట్ చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ముకేశ్, వర్షిణిలతో అపూర్వకు జరిగిన వాగ్వాదాలు ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ వారంలో త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ వీకెండ్ భారీగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందనే వార్తలతో ఐదో వారం ఎవరికి షాక్ ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!