

ఒకప్పుడు భారతీయ సినిమా మార్కెట్‌లో రూ.100 కోట్ల గ్రాస్ అందుకోవడమే ఎంతో గొప్ప విజయంగా భావించేవారు. 2010లలో హిందీ, తమిళ సినిమాలు రూ.300 కోట్ల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రూ.1000 కోట్ల గ్రాస్ అనేది భారతీయ సినిమా మార్కెట్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంచ్‌మార్క్‌గా మారింది. ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు ఈ మార్క్‌ను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ స్థాయికి భారతీయ సినిమా మార్కెట్‌ను తీసుకెళ్లడంలో తెలుగు సినిమాల పాత్ర కూడా కీలకంగా నిలిచింది.
అయితే తమిళ సినిమా మాత్రం ఎన్నో ఏళ్లుగా రూ.1000 కోట్ల మార్క్ కోసం ఎదురుచూస్తోంది. రజినీకాంత్ నటించిన జైలర్ తొలి భాగం రూ.600 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో, జైలర్ 2 ఈ ఘనతను అందుకునే అవకాశం ఉందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు కొంత బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తోంది. భారీ బ్లాస్ట్‌ను ఆశించిన ప్రేక్షకులకు ట్రైలర్ యావరేజ్‌గా అనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమా విడుదల సమయంలో లేదా విడుదల తర్వాత వచ్చే సర్‌ప్రైజ్‌లు ఈ అంచనాలను మార్చగలవా, జైలర్ 2 తమిళ సినిమాను రూ.1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!