

ఐటీఐ విద్యార్థులకు కూడా ఐఐటీ పట్టభద్రులతో సమానంగా గౌరవం, గుర్తింపు లభించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నైపుణ్య కార్మికుల పట్ల సమాజం దృక్పథం మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వృత్తి విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, నైపుణ్య ఆధారిత పనులను తక్కువగా చూడకూడదని సూచించారు. విద్యార్హతలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలకు కూడా సమాజంలో సమాన గుర్తింపు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జర్మనీని ఉదాహరణగా ప్రస్తావించిన లోకేశ్.. అక్కడ నైపుణ్య కార్మికులకు ఎంతో గౌరవం ఉంటుందని, అదే ఆ దేశ పారిశ్రామిక ప్రగతికి ప్రధాన బలంగా నిలుస్తోందని చెప్పారు. భారత్‌లోనూ ఇదే తరహా దృక్పథం పెరగాలని ఆకాంక్షించారు. ఐటీఐ విద్యపై ఉన్న చిన్నచూపు తొలగించి, నైపుణ్య ఆధారిత వృత్తులకు గౌరవం పెంచాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న వృత్తి పట్ల గర్వంగా ఉండేలా సమాజంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!