
బిజినెస్

దిశ చట్టం ఉపసంహరణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయాన్ని మహిళలకు ‘చీకటి రోజు’గా అభివర్ణిస్తూ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన సమగ్ర వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దిశ చట్టం ద్వారా మహిళలకు వేగవంతమైన న్యాయం, భద్రత కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
దిశ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా 1.51 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన 31,607 కాల్స్‌కు పోలీసులు స్పందించారని జగన్ తెలిపారు. ఈ గణాంకాలు దిశ వ్యవస్థ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని, ఇలాంటి కీలక చట్టాన్ని ఉపసంహరించడం మహిళల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!