

కేరళలో అరుదైన రాజకీయ సౌహార్దానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. పూంజార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.జె. సెబాస్టియన్ తన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఎల్‌డీఎఫ్ నేత సెబాస్టియన్ కులత్తుంకల్‌ను ఎరుమేలిలో కొత్తగా నిర్మించిన అమక్కున్ను వంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. వాజక్కల, అమక్కున్ను ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణానికి కులత్తుంకల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.80 లక్షలు మంజూరయ్యాయి. అనంతరం యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయింది.
వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే కులత్తుంకల్‌కే ఈ ప్రాజెక్టు పూర్తి క్రెడిట్ దక్కుతుందని ఎం.జె. సెబాస్టియన్ పేర్కొన్నారు. తాను కేవలం పనులు పూర్తయ్యేలా పరిపాలనా పరంగా సహకరించానని తెలిపారు. అంతేకాదు, ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరు లేకుండా కేవలం ‘పూంజార్ ఎమ్మెల్యే’ అని మాత్రమే నమోదు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ కూడా ప్రశంసలు వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!