

అంతరిక్ష రంగంలో చైనా మరోసారి తన ప్రయోగ సామర్థ్యాన్ని చాటుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో నాలుగు రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. వీటిలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థకు చెందిన ప్రయోగం కూడా ఉండటం విశేషం. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు, భూపరిశీలన వంటి అవసరాల కోసం సెప్టెంబర్ 15, 16 తేదీల్లో మూడు వేర్వేరు ప్రయోగ వేదికల నుంచి ఈ ప్రయోగాలు చేపట్టారు. అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యవధిలో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం తమకు ఉందని ఈ ప్రయోగాల ద్వారా చైనా మరోసారి చాటింది.
సెప్టెంబర్ 15న జికువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రైవేటు సంస్థ ల్యాండ్‌స్పేస్ అభివృద్ధి చేసిన జుక్యూ-2ఈ రాకెట్ ద్వారా పది ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం రూపొందిస్తున్న కియాన్‌ఫాన్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ నెట్‌వర్క్ కింద మొత్తం 10 వేల బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!