
జనరల్

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో సందడి చేశారు. వైరల్‌గా మారిన ‘యేశనగుల’ పాటకు ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. జానపద బాణీల హై-వోల్టేజ్ బీట్‌లకు తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ ఎక్స్‌ప్రెషన్స్, మాస్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. దీంతో ఈవెంట్ ప్రాంగణం కేరింతలు, చప్పట్లతో మార్మోగింది.
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని రెండో పాట ‘యేశనగుల’ ఇప్పటికే సంగీత ప్రియుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు ఈ పాటకు చేసిన డ్యాన్స్ ఈవెంట్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ప్రేక్షకులు కూడా ఆయనతో కలిసి పాటను ఆస్వాదిస్తూ సందడి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!