

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా సంస్థల మధ్య వివాదం మరింత ముదిరింది. వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో పాత్రికేయుల ప్రవేశాన్ని ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడంతో ఈ మూడు సంస్థలు తాజాగా ట్రంప్ ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. తమపై విధించిన నిషేధం రాజ్యాంగంలోని తొలి సవరణ కల్పించే పత్రికా స్వేచ్ఛ, భావప్రకటన హక్కులకు విరుద్ధమని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం ఏం రిపోర్ట్ చేయాలో లేదా ఏం ప్రచురించాలో నిర్ణయించే అధికారం కలిగి ఉండకూడదని సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. తమ పాత్రికేయుల హక్కులను కాపాడుకోవడం, ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా వార్తలు అందించే హక్కును పరిరక్షించుకోవడానికే న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపాయి. మరోవైపు, తమపై మీడియా సంస్థలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయనే కారణంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ వాదించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!