

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు తనయుడు గంటా ఆదర్శ్ సాయి బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గేతో చర్చించారు.
సమావేశం అనంతరం ఆదర్శ్ సాయి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులమతాల ప్రస్తావన లేకుండా ప్రజల మద్దతుతో అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. యువత కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని కోరారు. దేశంలో జరుగుతున్న పలు పరిణామాలు, సమస్యలపై ఖర్గేతో చర్చించానని తెలిపిన ఆయన, 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తమ లక్ష్యమని అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!