
జనరల్

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) పొన్నేటిపాలెం ఎంపీటీసీ సభ్యుడు బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక అనంతరం మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గురునాథ్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీపీ బాధ్యతలు అప్పగించిన నాయకులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!