

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రజా యుద్ధనౌక, దివంగత గద్దర్ గురించి పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గజ్జె కట్టి, గళం విప్పి పాటల రూపంలో తెలంగాణ బతుకు ప్రపంచానికి చట్టి చెప్పిన యోధుడు గద్దర్ అని ఆయన పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, సామాజిక ఉద్యమాల్లో ఆయన జీవితాంతం పోరాడి కాషాయ కసాయి పార్టీకి వ్యతిరేకంగా స్ఫూర్తిగా నిలిచారని విమర్శించారు.
తెలంగాణ సాంస్కృతిక రంగంలో తన ప్రత్యేక ముద్ర వేసిన గద్దర్ పేరిట “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు” ప్రారంభించబడ్డాయని, ఆయన కూతురు వెన్నెలను “తెలంగాణ సాంస్కృతిక సారథి”గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం నియమించిన విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. ఆయన వ్యాఖ్యల ద్వారా గద్దర్ వారసత్వం, తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చరిత్రను గౌరవించాల్సిన అవసరం ఉందని మళ్లీ పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!