
గాసిప్స్

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా సబ్సిడీ యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఉపయోగించలేని రైతులు సమీపంలోని మీసేవ కేంద్రంలో పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో యూరియా బుకింగ్ చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది.
మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేసి, రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద యూరియాను బుక్ చేస్తారు. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ధృవీకరించిన వెంటనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. రూ.10 సేవా రుసుముతో ఈ సేవ అందుబాటులో ఉండగా, బుకింగ్ ఐడీ 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!