

డీఎస్పీ భీమ్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పలు కీలక ఆరోపణలు చేసింది. సోదాల సమయంలో ఆయన ఇంటి నుంచి రెండు మెమొరీ కార్డులు, ఒక డైరీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మెమొరీ కార్డుల్లోని సమాచారంతో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయని తెలిపింది. అలాగే డైరీలో "మనకు ఇవ్వాల్సిన వాళ్లు" అనే జాబితాతో పాటు అప్పుల వివరాలు నమోదై ఉన్న మరో పేజీని గుర్తించినట్లు వెల్లడించింది.
మార్కెట్ విలువ ప్రకారం భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ ₹300 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. మొదట తన పేరుతో ఆస్తులు కొనుగోలు చేసి, అనంతరం బినామీల పేర్లకు బదిలీ చేశారని, వాటిపై నియంత్రణ కొనసాగించేందుకు ముందుగానే క్యాన్సిలేషన్ డీడ్లు తీసుకున్నారని ఆరోపించింది. విచారణలో ఆయన సహకరించలేదని, అక్రమాస్తులపై సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. సోదాల్లో 10 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లు గుర్తించినట్లు పేర్కొంటూ, మరిన్ని అక్రమ ఆస్తులు ఉండే అవకాశం ఉందని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!