
సినిమాలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్, ప్రకాశ్‌రాజ్ వంటి వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? వారికి మద్దతు ఇస్తున్నది ఎవరు? అంటూ ప్రశ్నించారు. హిందూ విశ్వాసాలను దెబ్బతీసే భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇలాంటి భావాలను సమర్థించడం హిందుత్వంపై దాడితో సమానమని ఆయన అన్నారు. వీటిని మతపరమైన ఉగ్రవాదంగా పరిగణించాలని పేర్కొంటూ, చట్టపరమైన చర్యలతో పాటు సమాజం కూడా ఇలాంటి భావజాలాన్ని తిరస్కరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!