

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరిగిన అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమైనవేనని ఆయన ఆరోపించారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చట్టవిరుద్ధంగా ఎన్నికైనవారేనని ఖర్గే వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని కోరారు.
ఈవీఎంలను దుర్వినియోగం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఈ విషయాన్ని తమకు చెందినవారే చెబుతున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అనేక అవకతవకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తోందని ఖర్గే విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!