
రాజకీయాలు

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన సోదరుడి కుమారుడికి కడప జిల్లా పరిషత్ (జడ్పీ) ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ పరిణామంతో ఆయన పార్టీకి దూరమవుతారనే ఆందోళన నేపథ్యంలో BJP నేతలు పలుమార్లు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
ఆదినారాయణరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆయనతో భేటీ అయ్యారు. విజయవాడలోని మినర్వా హోటల్‌లో ఎమ్మెల్యేను కలిశారు. రాజీనామా యోచనపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే, తన రాజీనామా విషయంపై ఆదినారాయణరెడ్డి నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!