

సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తన తల్లికి అవకాశం కల్పించాలని అనంత శ్రీరామ్ జనసేన నాయకులను కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించారని, ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇటీవలే అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు ఉమారాణి, వీరేవేంకట సత్యనారాయణ మూర్తి జనసేన పార్టీలో చేరారు.
తన తల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామ అభివృద్ధి కోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తానని అనంత శ్రీరామ్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.20 లక్షలు అందిస్తానని, మిగిలిన రూ.20 లక్షలను విడతల వారీగా ఖర్చు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైతే గ్రామ అభివృద్ధికి నిధులు సమకూర్చాలన్న ఆయన హామీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!