22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశంపై కోర్టు ఆంక్షలు

Writer: Nithish 07:05 AM, 22 నవంబర్, 2026
యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశంపై కోర్టు ఆంక్షలు

బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి వైఎస్‌ షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ప్రవేశించకుండా దేవనహళ్లి సీనియర్‌ సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ఈ ఆస్తి విషయంలో సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్యాలెస్‌లోని గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా ఉండేందుకు గతంలో అనుమతి పొందిన షర్మిల, ప్రస్తుతం అలంకరణ పనుల పేరుతో బయటి వ్యక్తులను లోపలికి తీసుకువస్తున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. దీనివల్ల ప్యాలెస్‌లోని నిర్మాణాలు, ఫెన్సింగ్‌, పండ్ల చెట్లు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణ వరకు షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా ఆదేశించింది.

షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని తొలుత నిర్ణయించగా, అక్కడ పెళ్లి నిర్వహించేందుకు జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తన నివాస ప్రాంగణంలో వివాహ వేడుక నిర్వహించడం సాధ్యం కాదని జగన్‌ గతంలో షర్మిలకు లేఖ రాసినట్లు సమాచారం. దీంతో వివాహ వేదికను మరోచోటికి మార్చిన షర్మిల, పెళ్లి పనుల నిమిత్తం ప్యాలెస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు కోర్టును ఆశ్రయించారు. 2007లో 20 ఏళ్ల కాలానికి ప్యాలెస్‌ను తమ సంస్థకు లీజుకు ఇచ్చారని, అభివృద్ధి పనుల కోసం భారీగా ఖర్చు చేసినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. 2026 ఆగస్టులో ఆస్తిని భారతి, ఆమె మనుమరాళ్లకు గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా బదిలీ చేసినట్లు కోర్టుకు వివరించారు. పిటిషనర్‌ వాదనలు, సమర్పించిన ఆధారాల ప్రకారం ఆస్తి వారి స్వాధీనంలో ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

ట్యాగ్లు
వైఎస్‌ జగన్‌వైఎస్‌ షర్మిలయలహంక ప్యాలెస్‌బెంగళూరుకోర్టు ఉత్తర్వులుసిలికాన్‌ బిల్డర్స్‌వైఎస్సార్‌సీపీఆస్తి వివాదంఅంజలి రెడ్డి వివాహంఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!