
జనరల్

టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ నటించి, స్వయంగా దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కల్ట్’ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది తన నుంచి మూడు సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని విశ్వక్ సేన్ భావించగా, అందులో భాగంగా మొదట విడుదలైన చిత్రం ఇదే. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఈనగరానికి ఏమైంది’ సీక్వెల్ థియేటర్లలో సందడి చేస్తుండగా, ‘కల్ట్’ మాత్రం డిజిటల్ వేదికపైకి వచ్చేసింది.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏ సర్టిఫికెట్ చిత్రానికి థియేటర్లలో ఆశించిన స్పందన లభించలేదు. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!