
జనరల్

తెలుగు ఓటీటీ రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా రూపొందించిన మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్ వెబ్ సిరీస్ 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ 2026)లో బెస్ట్ వెబ్ సిరీస్ విభాగానికి నామినేషన్ దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక విభాగంలో నామినేషన్ పొందిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఆది పినిశెట్టి, చైతన్య రావు, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ తాజా ఘనతతో తెలుగు కథలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!