

సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమా హ్యాపీ జర్నీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది. గత వారాంతంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రేటింగ్స్ విషయంలోనూ ఆకట్టుకుంటోంది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్ IMDbలో 9.7/10, BookMyShowలో 9.5/10 రేటింగ్స్ సాధించినట్లు సమాచారం.
గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ చేయగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మంచి కథనం, ఆహ్లాదకరమైన వినోదంతో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా హ్యాపీ జర్నీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!