

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా జియోహాట్‌స్టార్ లో ప్రతి వారం విభిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం పలు ఆసక్తికరమైన మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉన్నాయి. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. నివిన్ పౌలీ, మమితా బైజు నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఆకట్టుకుంటుండగా, విస్మయ మోహన్‌లాల్ నటించిన ‘తుడక్కమ్’ సర్వైవల్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘సర్వం మాయ’ హారర్ కామెడీగా, పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు నటించిన ‘ఐ, నోబడీ’ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
‘బెత్లెహెం కుటుంబ యూనిట్’లో ప్రేమ, కుటుంబ బంధాలు, పొరుగింటి అనుబంధాలను ఆసక్తికరంగా చూపించగా.. ‘తుడక్కమ్’లో బ్యాంక్ పరీక్ష కోసం ఎర్నాకులం వెళ్లిన యువతి జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల చుట్టూ కథ సాగుతుంది. ‘సర్వం మాయ’లో గిటారిస్ట్ ప్రభేందుకు ఎదురయ్యే వింత సంఘటనలు హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలతో సాగుతాయి. ఇక ‘ఐ, నోబడీ’లో సాధారణ ప్రభుత్వ ఉద్యోగి రాజీవన్ అనుకోకుండా ఓ నేరానికి సంబంధించిన ఘటనను చూడటంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ చిత్రాలకు తెలుగు డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉండటంతో మలయాళ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు మంచి ఓటీటీ ఎంపికలుగా నిలుస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!