

ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మోగ్లీ. నేషనల్ అవార్డ్ గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.
అయితే విడుదలైన 20 రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీకి రానుంది. మోగ్లీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్ దక్కించుకుంది. న్యూ ఇయర్ ప్రత్యేక కానుకగా జనవరి 1 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు చిత్ర బృందం, ఓటీటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించగా, వైవా హర్ష, కృష్ణ భగవాన్, మౌనిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్ రిలీజ్ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఓటీటీ విడుదల కావడంతో, మోగ్లీపై డిజిటల్ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!