

బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్లో చేరి చరిత్ర సృష్టించిన సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ సొంతం చేసుకోగా, జూలై 17, 2026 నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తొలి దశలో తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల చేయనుండగా, త్వరలో ఇతర దక్షిణాది భాషలు, హిందీలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ అందించగా, నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపై కూడా భారీ ఆదరణ పొందుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!