

1999 కార్గిల్ యుద్ధం ఆధారంగా రూపొందిన దేశభక్తి మిలిటరీ వార్ డ్రామా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా సిద్ధార్థ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
1999 మే 26న భారత వైమానిక దళం ప్రారంభించిన చారిత్రక ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. కార్గిల్ యుద్ధంలో శత్రువులను మంచు కొండల నుంచి తరిమికొట్టేందుకు చేపట్టిన ఈ సాహసోపేత ఆపరేషన్‌లో ‘ది గోల్డెన్ యారోస్’ కీలక పాత్ర పోషించింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను భావోద్వేగభరితంగా ఆవిష్కరించే ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!