

ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. హిందీలో విజయవంతమైన ‘బందిష్ బాండిట్స్’ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగే ఈ కథలో తన తాత శాస్త్రి గారి గొప్ప సంగీత వారసత్వానికి వారసుడైన బాలు జీవితాన్ని చూపించనున్నారు. సంప్రదాయాల భారం, దెబ్బతిన్న కుటుంబ బంధాలు, ఎన్నో ఏళ్లుగా దాచిన రహస్యాలు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. సంగీతం ఈ కుటుంబంలోని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, గర్వం, ఆశ వంటి భావాలను వ్యక్తపరిచే ప్రధాన భాషగా నిలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కు సంగీతం అందించారు. అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, రూప లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!